Best City for Women: భారతదేశంలో మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూర్ నిలిచింది. చెన్నై కేంద్రంగా ఉన్న వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. సామాజిక మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రీయల్ ఇంక్లూషన్ వంటి వాటి ఆధారంగా దేశంలోని 125 నగరాలు మహిళలకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో అంచనా వేసింది. బెంగళూర్ 53.29 ఇంక్లూషన్ స్కోర్(CIS)తో అగ్రస్థానంలో ఉండగా, చెన్నై (49.86), పూణే (46.27) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 46.04తో నాలుగో స్థానంలో ఉండగా, ముంబైన 44.49 ఐదో స్థానంలో నిలిచాయి.
భద్రత, ఆరోగ్య, విద్యా, మొబిలిటీ, జీవన సౌలభ్యం వంటి అంశాలను కొలిచే సామాజిక ఇంక్లూజన్ స్కోరు (SIS) , అధికారిక ఉద్యోగ అవకాశాలు, కార్పొరేట్ ఇంక్లూజన్ పద్ధతులు, నైపుణ్యం మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ట్రాక్ చేసే పారిశ్రామిక ఇంక్లూజన్ స్కోరు (IIS) ఆధారంగా ఈ స్కోర్ ఇచ్చారు.
Read Also: Supreme Court: ‘‘కుక్కల్ని కాదు, పిల్లులను పెంచుకోండి’’.. వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టు..
బలమైన కార్పొరేట్ ఎకోసిస్టమ్, విస్తృత ఫార్మల్ ఉద్యోగ మార్కెట్, సంస్థల్లో డైవర్సిటీ & ఇన్‌క్లూజన్ విధానాల అమలుతో పాటు టెక్, స్టార్టప్ రంగాల్లో మహిళలకు అధిక అవకాశాలు బెంగళూర్‌ను టాప్ పొజిషన్‌లో నిలబెట్టాయి. భద్రత, విద్యా, ఆరోగ్య సేవల్లో చెన్నై మెరుగుగా ఉంది. పూణే, హైదరాబాద్ నగరాలు సామాజిక, పారిశ్రామిక అంశాల్లో సమతుల్యతను పాటిస్తున్నాయి. టాప్-5లో దక్షిణ భారతీయ నగరాలతో పాటు పశ్చిమ భారతీయ నగరాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
మహిళలకు టాప్-10 బెస్ట్ నగరాలు ఇవే:
1. బెంగళూర్
2. చెన్నై
3. పూణే
4. హైదరాబాద్
5. ముంబై
6. గురుగ్రామ్
7. కోల్‌కతా
8. అహ్మదాబాద్
9. తిరువనంతపురం
9. కోయంబత్తూర్