BCCI: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మణికట్టు, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలు అయ్యాయని బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో చెప్పుకొచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బోర్డు అండగా ఉంటుందని…
IPL Cricket: ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. కానీ.. ఐపీఎల్‌ని ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్ అని సైతం అభివర్ణించొచ్చు. మన దేశంలోని అత్యంత విజయవంతమైన, అత్యధిక లాభదాయకమైన నవతరం స్టార్టప్‌లలో ఒకటిగా ఐపీఎల్ ఇప్పటికే తననుతాను నిరూపించుకుంది. బిజినెస్ విషయంలో.. విలువ పరంగా.. ఐపీఎల్.. యూనికార్న్ లెవల్ నుంచి డెకాకార్న్ స్థాయికి ఎదిగింది. ఈ క్రికెట్ లీగ్ వ్యాల్యూని డీ అండ్ పీ అడ్వైజరీ అనే కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది.
స్వల్పం విరామం తర్వాత టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో సెలక్షన్ కమిటీని తొలగించింది. కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సెలక్షన్ ప్యానల్లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్…
Today (22-12-22) Business Headlines: ఆజాద్ ఇంజనీరింగ్ స్పెషల్ యూనిట్: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ.. జపాన్ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం స్పెషల్ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్ లేదా గ్యాస్ ఎయిర్ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది.
2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యమవ్వనున్న నేపథ్యంలో.. వరల్డ్ కప్ భారత్ నుంచి తరలిపోతుందనే వార్త టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది.
Team India: టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమీకరణాలన్నీ మార్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో బీసీసీఐ దృష్టిలో కూడా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నాడు. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు…
Team India: ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే షమీ, జడేజా లాంటి ప్రధాన ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టులో పలు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది. అటు…
Team India: కొంతకాలంగా టీమిండియా పతనం దిశగా సాగుతోంది. ఆటగాళ్ల ప్రదర్శన పక్కనబెడితే తరచూ అందరూ గాయాల బారిన పడుతున్నారు. దీంతో కీలక సిరీస్‌లకు ముఖ్యమైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా ప్రదర్శన దారుణంగా ఉంటోంది. కొన్నేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో ఊహించుకోవచ్చు. దీనికి కారణం కోచ్, బీసీసీఐ చెత్త నిర్ణయాలే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ మార్పుతో పాటు కొత్త…
IPL 2023: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ రూల్ భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఆట ప్రారంభం కావడానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు కేవలం…