రహానేను ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్మెంట్ ధోని అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్ నెస్, ఆటతీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వెటరన్ బ్యాటర్ అజింక్య రహానె జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్కు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు.
BCCI: ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా నడుస్తోంది. ఈ సమయంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోని ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది జూన్ లో ఆఫ్గాన్ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆఫ్గానిస్తాన్ చివరగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది.
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్ కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగనున్న డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. అయితే డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో…
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది.
అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా న్యూ లుక్ లో కనిపించేలా కసరత్తులు చేస్తోంది. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది.