భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, టీమిండియాకు గత మూడేండ్ల పాటు చీఫ్ సెలక్టర్ గా పనిచేసిన ఛేతన్ శర్మ తాజాగా పోస్ట్ చేసిన ట్వీట్ సంచలన రేపుతుంది. టీమిండియా మాజీ సారథి, బీసీసీఐకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సౌరవ్ గంగూలీ హయాంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మెన్ గా ఛేతన్ శర్మ చక్రం తిప్పారు. కొద్దిరోజుల క్రితం ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికి తన పదవికి రాజీనామా చేశాడు. టీమిండియాలోని రహస్యాలు, గంగూలీ – కోహ్లీ మధ్య గొడవ, భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఫిట్నెస్ తో పాటు నెక్ట్స్ కెప్టెన్ వంటి విషయాలపై ఛేతన్ శర్మ మాట్లాడిన మాటలు భారత క్రికెట్ లో సంచలనం రేపాయి.
Also Read : MP K.Laxman : మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుతోంది
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ స్టింగ్ ఆపరేషన్ లో ఛేతన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో బీసీసీఐ తక్షణమే ఉపశమన చర్యలకు దిగింది. ఛేతన్ ను పదవి నుంచి తప్పించకముందే అతడే తన పోస్టుకు రాజీనామా చేశాడు. దీంతో బీసీసీఐ.. శివ సుందర్ దాస్ ను తాత్కాలిక చైర్మెన్ గా నియమించింది. అయితే ఇన్నాళ్లు స్టింగ్ ఆపరేషన్, అందులో తాను మాట్లాడిన మాటల గురించి సైలెంట్ గా ఉన్నాడు. అయితే ఛేతన్ శర్మ తాజాగా స్పందించాడు. బుధవారం అర్థరాత్రి ట్విటర్ వేదికగా ఛేతన్ తన ట్విటర్ అకౌంట్ లో ఇప్పటివరకూ జీవితం చాలా కష్టంగా ఉంది. మీ దగ్గరి బంధువుల నుంచి గానీ ప్రియమైన వారి నుంచి గానీ ఎటువంటి మద్దతు లేదు. మాతా రాణి నన్ను ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నా..’అని రాసుకొచ్చాడు.
Also Read : Virat Kohli : బౌలర్ గా అవతారమెత్తిన విరాట్ కోహ్లీ
స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఛేతన్ చెప్పిన విషయాలు పెద్దధూమారం రేపాయి. కోహ్లీ – గంగూలీ విబేధాలతో పాటు కొంతమంది భారత ఆటగాళ్లు ఫిట్నెస్ కోసం డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం సంచలనానికి దారి తీసింది. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. సరిగ్గా ఛేతన్ శర్మ వీడియో వైరల్ గా మారిన తర్వాత రోజే ఐపీఎల్ – 2023 షెడ్యూల్ ప్రకటించి ఆ టాఫిక్ ఛేతన్ శర్మ చుట్టూ కాకుండా ఐపీఎల్ వైపునకు మళ్లించింది. దీంతో ఛేతన్ వీడియో వ్యవహారం మరుగునపడింది.
Life has been very tough so far. No hope from your near & dear. Hope Mata Rani bless me…..
— Chetan Sharma (@chetans1987) May 17, 2023