డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న భారత జట్టులో సాహా చేరితే.. మంచి అనుభవం ఉన్న బ్యాటర్ దొరికినట్లే.
Also Read : Govinda Namalu: నేడు గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
భారత్ లో టాప్ వికెట్ కీపర్లలో సాహా ఒకరు. దానికితోడు విదేశాల్లో ప్లేయర్లు రాణించాలంటే.. అక్కడ ఆడిన అనుభవం వారికి చాలా ముఖ్యం. అది లేకుండా కొత్త వాళ్లు వెళ్లినా ఆ పరిస్థితుల్లో రాణిస్తారనే నమ్మకం మాత్రం ఉండదు. కానీ సాహా లాంటి సీనియర్లకు ఈ సమస్య ఉండదు. ఎందుకంటే అతను దాదాపుగా అన్ని దేశల్లో ఆడిన అనుభవం ఉంటుంది. రిషభ్ పంత్ లేకపోవడంతో టీమిండియా మిడిలార్డర్‌లో కౌంటర్ ఎటాకింగ్ బ్యాటింగ్ చేసే ఆటగాడు లేకుండా పోయాడు. ఈ స్థానంలో సూర్యకుమార్‌ను తీసుకున్నా.. అతను టెస్టుల్లో రాణించడం అంత ఈజీ కాదు. అదే సమయంలో సాహా అయితే అవసరమైతే విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడు.
Also Read : Jammu Kashmir: కాశ్మీర్‌లో రెండు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు.. ఒక ఉగ్రవాది హతం..
అయితే సాహా తాజాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్నాడు. తనలో ఎంత విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడో చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి పంత్ లేని లోటును కూడా అతను తీర్చగలడు. టెస్టుల్లో సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా ఉన్న ఆటగాళ్లకు మంచి రికార్డు ఉండటం అంత ఈజీ కాదు. కానీ సాహా తన కెరీర్‌లో చక్కగా రాణించాడు. ముఖ్యంగా కీపర్‌గా సాహా టెక్నిక్ అద్భుతమని చెప్పొచ్చు. దానికితోడు బ్యాటింగ్‌లోనూ అతను జట్టును ఆదుకోగలడు. అతని కెరీర్ యావరేజ్ 29 కూడా తక్కువేం కాదు. ఈ క్రమంలోనే రాహుల్ లేకపోవడంతో అనుభవం లేని ఇషాన్ కిషన్‌కు ఈ కీలక మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కదాని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వృద్ధిమాన్ సాహా ఇంగ్లండ్ పంపించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.