Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాక్.. అలాంటి ప్రతిపాదన ఏం లేదన్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్ లో ఆడేందుకు ససేమిరా అంటోంది. అయితే పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ ను బహిష్కరిస్తే ఇండియాలో జరిగే వాటిని కూడా బహిష్కరిస్తామంటూ గతంలో పాక్ మాజీ ఆటగాళ్లు ప్రగల్భాలు పలికారు.
Read Also: Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇదిలా ఉంటే భారత్ తో జరిగే మ్యాచులను హైబ్రీడ్ మోడల్ లో నిర్వహిస్తామని పీసీబీ ప్రతిపాదించినట్లు అందుకు భారత్ కూడా అంగీకరించినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. హైబ్రీడ్ మోడల్ అంటే భారత్ తో జరిగే మ్యాచులను తటస్థ వేదికలు అయిన యూఏఈ, యూకే, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో నిర్వహిస్తామంటూ పీసీబీ ప్రతిపాదించింది. దీనికి భారత్ అంగీకరించిందని పాకిస్తాన్ మీడియా కోడై కూసింది.
అయితే తాజాగా బీసీసీఐ ప్రకటనతో పాకిస్తాన్ కు షాక్ తగిలింది. పీసీబీ హైబ్రీడ్ మోడల్ కు బీసీసీఐ అంగీకరించదనే వాదనలను తోసి పుచ్చింది. అలాంటిదేం లేదని ప్రకటించింది. ఆసియా కప్ 2023 కోసం హైబ్రిడ్ మోడల్‌ను బోర్డు ఆమోదించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ఫైనల్ చూడటానికి శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారును ఆహ్వానించినట్లు బీసీసీఐ తెలిపింది. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఆసియా కప్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ ఇటీవల తెలిపింది.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!