Chetan Sharma Resigns: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మపై ఓ మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ పెను దుమారమే రేపింది.. చివరకు ఆయన పోస్టుకు ఎసరు తెచ్చింది.. ఆ స్టింగ్ ఆపరేషన్ వివాదానికి దారి తీయడంతో.. చీఫ్ సెలక్టర్ పరదవికి రాజీనామా చేశారు చేతన్ శర్మ.. తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌తో చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది..…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.
Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషధ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలిసీ తెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్…
Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్లో కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పించామని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడని తెలిపింది. అక్కడ నిపుణుల సమక్షంలో రిహాబిలిటేషన్ పొందుతాడని బీసీసీఐ పేర్కొంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్‌ను ఎంపిక చేసినట్లు వివరించింది. Read Also:…
T20 League: టీ20 క్రికెట్లో మరో లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్‌లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్‌కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు…
BCCI: రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఈ సీజన్లో పంత్ ఆడకపోయినా పూర్తి జీతం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ఆటగాడైన పంత్‌కు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్‌కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న…
BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను…
Rishab Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్‌ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.