Asia Cup 2023 Venue To Change: ఆసియా కప్ వేదిక విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే! ఆసియా కప్ మెగా ఈవెంట్ నిర్వహించే హక్కులను సొంతం చేసుకున్న పాకిస్తాన్, తమ దేశంలోనే ఆ టోర్నీని నిర్వహించాలని పట్టుబడితే.. పాక్‌లో నిర్వహిస్తే మాత్రం తాము ఆ గడ్డపై కాలు మోపమని భారత్ తేల్చి చెప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే.. భారత జట్టుకి సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే.. ఈ హైబ్రీడ్ మోడల్‌ను సైతం బీసీసీఐ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. మొత్తం వేదికనే మార్చాల్సిందిగా భారత్ క్రికెట్ బోర్డు కోరింది. దీంతో.. ఆసియా కప్-2023 నిర్వహణ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు తరలించినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ నెలలో జరిగే సమావేశంలో.. ఆసియా కప్ నిర్వహణ వేదికపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా.. సెప్టెంబరులో ఈ టోర్నీ ఆరంభానికి షెడ్యూల్ ఖరారు కానుంది.
Rashmika: ఓ.. పాప.. ముందు వెనుక చూసుకోవాలిగా.. ఇప్పుడు అడ్డంగా దొరికావ్
ఇదిలావుండగా.. గతేడాదిలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే! ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌లో సత్తా చాటిన భారత్.. సూపర్ 4లో మాత్రం చేతులెత్తేసింది. మూడింటిలో రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. ఫైనల్‌కు చేరలేకపోయింది. ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక 23 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 147 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భానుక రాజపక్స (45 బంతుల్లో 71 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, శ్రీలంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.