ODI World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. దీని కోసం బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచకప్ జరగనుంది. జూన్ 7 నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత 2023 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.
Read Also: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. పంజాబ్, హర్యానాల్లో ప్రకంపనలు..
ఇదిలా ఉంటే వన్డే ప్రపంచ కప్ నిర్వహించడానికి భారతదేశంలోని 15 నగరాల్లోని వేదికను సిద్ధం చేసింది. ఈ నగరాలను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ, త్వరలోనే ఈ నివేదికను ఐసీసీతో పంచుకోనుంది. దీని తర్వాత మ్యాచులు జరగబోయే తుది వేదికల పేర్లను ఖరారు చేయనున్నారు. చివరి సారిగా 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలు కలిసి సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ నిర్వహించాయి. 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. 2023 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య జరగబోతోంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. టోర్నీ ప్రారంభానికి మరో 4 నెలుల మాత్రమే గడువు ఉంది.
మొత్తం 10 దేశాలు పాల్గొనే ఈ టోర్నమెంట్ లో 46 రోజుల పాటు 48 మ్యాచులు జరగుతాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని మొత్తం 15 నగరాల్లో వేదికలను షార్ట్ లిస్ట్ చేశారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై , త్రివేండ్రం, నాగ్‌పూర్ , పుణెలో వేదికలుగా మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.