MLC Kavitha : ధర్నా చౌక్ దగ్గర ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. అయితే.. పోలీసులు ఒక రోజుకు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో.. జాగృతి సభ్యులు కోర్టును ఆశ్రయించించారు. అయితే.. 72 గంటలు దీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు తెలపడంతో ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమించారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తూ.. దీక్షను ఇంతటితో ముగిస్తున్నానన్నారు. పోరాటం ఆగదు.. అనేక రూపాల్లో పోరాటం చేస్తామని ఆమె…
TPCC Mahesh Goud : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ధర్నాలో పాల్గొనే కార్యకర్తలను రైల్వే స్టేషన్‌కు చేర్చే బాధ్యత ఆయా…
బీసీ రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్ష లీడర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఆ పార్టీకి ఇష్టం లేక, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు…
రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ కి ప్రత్యేక రైల్ లో బయలుదేరనున్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేయపట్టనున్నది. ప్రతి జిల్లా డీసీసీ ల నుంచి 25 మంది వెళ్లనున్నారు. ఆగస్టు 5 న పార్లమెంట్ లో తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంటు లో…
బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్సీ కవిత రేపటి నుంచి దీక్ష చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కవిత దీక్షకు సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9…
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఎన్టీవీతో క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తప్పుల తడక ఉన్నప్పటికీ బీసీ కులగణన జరిగిందని, ముస్లింలు, బీసీలు, కలిపి 56 శాతం ఉండాలి.. కానీ రేవంత్ రెడ్డి 42 శాతమే ఇచ్చారన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, సెప్టెంబర్ 30 వరకూ ఉన్న డెడ్‌లైన్‌లోపు ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు…
MLC Kavitha : ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీలంటే నాలుగైదు కులాలు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అంతర్గతంగానే మాట్లాడాలని, బీసీలకోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ కవిత. వృత్తిపనులకు చేయూత ఇచ్చే కార్యక్రమాలు చేశామని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ ఎత్తేసిన తర్వాత బీసీ ఉద్యమం ఊపందుకుందన్నారు కవిత. Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే! మహిళల విషయాలు మహిళలే మాట్లాడాలి అంటే సమస్యలు…
Etela Rajender : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హాయంలో బీసీ శాతం 23 కు పడిపోయిందని ఆయన మండిపడ్డారు. బీసీల కళ్లలో మట్టి కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీఅని, బీఆర్ఎస్ పార్టీకి…
BC Reservation : హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని వ్యక్తిగతంగా కలసి ఆమోదం పొందేందుకు వచ్చే నెల 5, 6, 7 ఆగస్టు తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలని తేల్చింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రివర్గం వివరాల ప్రకారం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు…
Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా…