రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ కి ప్రత్యేక రైల్ లో బయలుదేరనున్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేయపట్టనున్నది. ప్రతి జిల్లా డీసీసీ ల నుంచి 25 మంది వెళ్లనున్నారు. ఆగస్టు 5 న పార్లమెంట్ లో తెలంగాణలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంటు లో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయనున్నది.
Also Read:Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..
ఆగస్టు 6న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించనున్నది. ఆగస్టు 7న బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి వినతపత్రాలు అందజేయనున్నారు. ధర్నా లో సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి..మంత్రులు పాల్గొననున్నారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. మంత్రులు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.