MLC Kavitha : ధర్నా చౌక్ దగ్గర ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. అయితే.. పోలీసులు ఒక రోజుకు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో.. జాగృతి సభ్యులు కోర్టును ఆశ్రయించించారు. అయితే.. 72 గంటలు దీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు తెలపడంతో ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమించారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తూ.. దీక్షను ఇంతటితో ముగిస్తున్నానన్నారు. పోరాటం ఆగదు.. అనేక రూపాల్లో పోరాటం చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు.
Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!
ఒక్కడుగు వెనిక్కి వేస్తే.. పదడుగులు ముందుకు వేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్ళండని, సుప్రీంకోర్టులో గవర్నర్ మీద కేసు వేయండని, ఢిల్లీలో టైం పాస్ ధర్నాలు చేస్తే.. తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరమన్నారు. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళితే.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుందని ఊహించారా..?