చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు! సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ…
తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలపై ఈ పిటిషన్లు వేశారని ప్రశ్నించింది.
BC Reservations: తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే? ఈ సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు ఉన్న 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు…
నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు..…
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు.
ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.