Guvvala Balaraju : అవినీతి ఆరోపణలు, వరుస విచారణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల తీరు బాధించింది
మంగళవారం ఆయన మరోసారి ఈ రాజీనామాపై స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఈనెల 2న తన రాజీనామా సమర్పించానని, కాళేశ్వరం నివేదిక వెలువడిన తర్వాత రాజీనామా చేశానని చెప్పడం సరైందికాదని వ్యాఖ్యానించారు. తన లేఖలో ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది.. నేనూ బాధ పెట్టదల్చుకోలేదన్నారు గువ్వల బాలరాజు.
మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు బాలరాజు వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారి కాదని, కేవలం పాత్రధారినేనని స్పష్టం చేశారు. కేసీఆర్ సూచన మేరకే ఆ ఘటనకు తాను వెళ్లినట్లు తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా మా నియోజకవర్గానికి చెందినవారే అని ఆయన అన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించలేదని, తన అనుచరులు, జిల్లా ప్రజల అభిప్రాయాల ప్రకారం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
NDA Meeting: నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ప్రసంగించనున్న మోడీ