దులీప్ ట్రోఫీలో ఇండియా 'ఎ' జట్టు ఇండియా 'డి'తో తలపడుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా డి జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఏడు…
నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది.
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
One Leg Batting Viral Video: క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్‌నెస్ అవసరం. ఫిట్‌నెస్‌తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొన్నిసారి సరైన ఫుట్‌వర్క్ లేక అవుట్ అయి పోతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.…
రోహిత్ శర్మను ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగడం మీరెప్పుడైనా చూశారా..? ఎక్కువగా ఓపెనర్ గా దిగే హిట్ మ్యాన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి.
వైటాలిటీ బ్లాస్ట్ లో చివరి మ్యాచ్ హాంప్‌షైర్ మరియు ఎసెక్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఇందులో జో వెటర్లీ అత్యధికంగా 63 పరుగులు చేశాడు.