విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు కావాలి. MS ధోని లాంటి బ్యాట్స్‌మన్ వచ్చి భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో ఎసెక్స్ జట్టు 4 సంవత్సరాలలో మొదటిసారిగా వైటాలిటీ T20 బ్లాస్ట్‌లో ఫైనల్‌కి చేరుకుంది. వైటాలిటీ బ్లాస్ట్ లో చివరి మ్యాచ్ హాంప్‌షైర్ మరియు ఎసెక్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఇందులో జో వెటర్లీ అత్యధికంగా 63 పరుగులు చేశాడు.
హాంప్‌షైర్ బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఎసెక్స్ 12 ఓవర్లలో 115 పరుగుల లక్ష్యాన్ని సాధించాలి. ఎసెక్స్ ఆరంభంలోనే 2 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. దీంతో జట్టు కష్టాల్లో పడింది.
Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
చివరి 2 ఓవర్లలో ఎసెక్స్ విజయానికి 20 పరుగులు అవసరం ఉంది.. ఇది కష్టంగా అనిపించింది. తర్వాతి ఓవర్‌లో లియామ్ డాసన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో ఎసెక్స్ విజయానికి 13 పరుగులు కావాలి. దీంతో మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారింది. చివరకు ఎసెక్స్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. మాట్ క్రిచ్లీ క్రీజులో ఉండగా.. మరో ఎండ్‌లో సైమన్ హార్మర్ ఉన్నారు. నాథన్ ఎల్లిస్ వేసిన ఓవర్ తొలి బంతిని మాట్ క్రిచ్లీ సిక్సర్‌గా బాదాడు. తర్వాతి బంతికి క్రిచ్లీ సింగిల్ తీశాడు. ఆ తర్వాత ఎసెక్స్‌కు 4 బంతుల్లో 6 పరుగులు కావాలి. తర్వాతి బంతికి హార్మర్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ధోనీ స్టైల్‌లో సిక్సర్ కొట్టి ఎసెక్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఎసెక్స్ 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.