Sourav Ganguly: అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈసారైనా భారత్ జోరుకు బ్రేకులు వేద్దామన్న పాక్ కల.. కలగానే ఉండిపోయింది. వరుసగా వరల్డ్ కప్ ల్లో భారత్ 8 మ్యాచ్ ల్లో గెలిచింది. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 155/2 స్కోరుతో ఉన్న పాకిస్తాన్.. 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 86, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో టీమిండియాకి ఘన విజయం దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Good News: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్
మేం ఆడేటప్పుడు పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదు.. అది పూర్తిగా డిఫరెంట్ టీమ్, వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ ఉండేది.. వాళ్ల బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉండేది.. ఇలాంటి పాక్ టీమ్‌తో మేం ఆడేవాళ్లం కాదని గంగూలీ అన్నాడు. అంతేకాకుండా.. ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోందని తెలిపాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్‌ని కూడా తట్టుకోలేకపోతున్నారని.. ఇలాంటి బ్యాటింగ్‌తో వరల్డ్ కప్‌లో నెట్టుకురావడం చాలా కష్టమని గంగూలీ విమర్శించారు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఎవరి బ్యాటింగ్‌లోనూ తనకు కసి కనిపించలేదని.. టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడినట్టే అనిపించిందన్నాడు. మేం చూసిన పాకిస్తాన్ టీమ్ అస్సలు ఇలా ఉండేది కాదు..’ అంటూ గంగూలీ కామెంట్ చేశాడు.
Read Also: Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ..