Viral Video: హ్యాట్సాఫ్ బాసూ.. ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Leg Batting Viral Video: క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్‌నెస్ అవసరం. ఫిట్‌నెస్‌తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొన్నిసారి సరైన ఫుట్‌వర్క్ లేక అవుట్ అయి పోతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ దివ్యాంగ యువకుడు ఒంటి కాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఫాస్ట్ బౌలర్‌ను సునాయాసంగా ఎదుర్కోవడం ఇక్కడ విశేషం. ఓ స్టార్ బ్యాటర్‌కు ఎంత ఫుట్‌వర్క్ ఉంటుందో.. ఈ దివ్యాంగ యువకుడికి ఒక కాలే ఉన్నా అదే దివ్యాంగ ఫుట్‌వర్క్ ఉంది. క్రీజులో సునాయాసంగా కదులుతూ బంతిని బాదుతున్నాడు. అంతేకాదు భారీ షాట్స్ కూడా అలవోకగా బాదేస్తున్నాడు. ఆ యువకుడు ఆడే విధానం చూస్తే.. అతడికి రెండు కాళ్లు ఉన్నాయా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Asian Games 2023: ఆసియా గేమ్స్ సెమీస్ చేరిన భారత జట్టు!
దివ్యాంగ యువకుడు ఒంటి కాలితో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ‘బార్మీ ఆర్మీ’ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘వైకల్యం ఆ యువకుడు ఉత్సాహాన్ని ఏ మాత్రం కుంగదీయలేదు’, ‘సంకల్ప బలంతో వైకల్యాన్ని కూడా ఎదిరించి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు’, ‘హ్యాట్సాఫ్ బాసూ’ అంటూ నెటిజన్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు.
How amazing is this guy batting on one 🦵
AN INSPIRATION ❤️ pic.twitter.com/PboTaixI4g
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) September 20, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?