అహ్మదాబాద్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఆస్ట్రేలియాపై చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల విజృంభణతో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులే చేశారు. అయితే ఇంతటి దారుణ పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఓటమి లేకుండా ఆడిన భారత్.. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి టీమిండియా అభిమానుల ఆశలను నిరాశ చేసింది.
Read Also: Cholesterol Diet: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ ఆహారం తీసుకోవాలి..!
కాగా.. నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
Read Also: Ashwin Babu: ఓంకార్ తమ్ముడు వేగం మాములుగా లేదుగా..
ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో పెద్దగా ఎవరూ రాణించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ల వికెట్లు కోల్పోయాయి. ఈ సమయంలోనే అఫ్రిది కామెంట్స్ చేశాడు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.