చికిత్స కోసం భారత్‌కు వచ్చిన కువైట్‌కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్‌కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్‌బాగ్‌ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
IND Vs BAN: మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే…
మీర్పూర్ వేదికగా… భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం అయ్యింది.. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తొలి టెస్టులో టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు అద్భుతంగా రాణించారు. చతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోరుకి పునాదులు వేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్…అసాధారణ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు..…
India's 188-Run Win Over Bangladesh: బంగ్లాదేశ్ లో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టెస్టుల్లో శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, భారత బౌలింగ్ ముందు దాసోహం అయింది. ఐదోరోజు బంగ్లాదేశ్ ను 324 రన్స్ చేసి ఆలౌట్ చేశారు. రెండు…
ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 272 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది.
IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 133/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం సెషన్లో ఆట ప్రారంభమైన కాసేపటికే బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ 5 వికెట్లతో విజృంభించాడు. 28 పరుగులు చేసిన ముష్పీకర్ రహీమ్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు, లిట్టన్ దాస్ 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్…