బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు షకీబ్ అల్ హసన్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్ తో మార్చ్ 31న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
Read Also : Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
అయితే ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా.. మే 9-14 మధ్య కెమ్స్ ఫోర్డ్ లో మూడు వన్డేల్లో బంగ్లాదేశ్-ఐర్లాండ్ తలపడను్ననాయి. ఇదే కారణంతో మరో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఇండియన్ ప్రీమియర్ ఆడే అవాకాశాలు తక్కువగా ఉన్నాయి.
Read Also : Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం
వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించగా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ అల్ హసన్ దూరమైతే కోత్ కతా టీమ్ లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Read Also : China: భారత్‌తో సంబంధాల బలోపేతానికి సిద్ధం.. రష్యా ఫారిన్ పాలసీపై చైనా..
అయితే ఇప్పటికే ఐపీఎల్ లోని పలు ఫ్రాంఛైజీలు బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆటగాళ్లను పంపించకుండా.. ఐపీఎల్ టైంలోనే ఇంటర్నెషన్ మ్యాచ్ లు షెడ్యూల్ పెట్టుకోవడంతో వచ్చే ఏడాది నుంచి ఈ రెండు దేశాల ఆటగాళ్లను బైకాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు చేపిన పనికి ఫ్రాంఛైజీల వాదనకు మరింత బలం చేకురింది. మరి ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ఆటగాళ్లు వేలంలో ఉంటారో లేదో చూడాలి మరీ..