Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగడం లేదు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, ఆ దేశంలో మతోన్మాదులకు, ఉగ్రవాదులకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ అరాచకాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థల నేతలు చెలరేగిపోతున్నారు.
India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్‌ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం.
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు సందర్భాల్లో మైనారిటీలపై దాడుల గురించి ఇండియా ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా భారత్ సంచలన నిర్ణయాలు…
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత, ఒక గుంపు దాడికి పాల్పడింది. సందర్శకుడిని నిర్బంధించిన తర్వాత దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఒక గుంపు ఆవరణలోకి చొరబడి మ్యూజియం, ఆడిటోరియంపై…
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అతిపెద్ద విచారణను ప్రారంభించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది, హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకుంది. ప్రస్తుతం, భారత్‌లోనే ఆశ్రయం పొందుతోంది.