Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకం తర్వాత మైనారిటీలు , ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు.…
Zakir Ali Anik made bold comments Ahead of Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్ వద్దే ఆతిథ్య హక్కుల ఉన్నా.. గతంలో పాకిస్థాన్‌తో చేసుకున్న ఒప్పదం కారణంగా తటస్థ వేదికలో టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 9న అఫ్గానిస్థాన్, హాంకాంగ్ పోరుతో ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచును హాంకాంగ్‌తో తలపడనుంది. టోర్నీ కోసం 20…
Prostitution Racket: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. భారతదేశం చూపిస్తామంటూ మాయచేసి బంగ్లాదేశ్ యువతిని అక్రమంగా హైదరాబాద్‌కి స్నేహితురాలు తీసుకవచ్చింది. ఆ తర్వాత మెహదీపట్నంలో ఉంటున్న షహనాజ్, హజీరా అనే మహిళలతో పాటు ఆటోడ్రైవర్ సమీర్ యువతిని వ్యభిచారంలోకి నెట్టారు. ఆ తర్వాత సదరు మైనర్ బాలికను ఆరు నెలల పాటు హోటళ్లలో పాడు పనులకు ఇష్టానుసారం వాడేశారు. ఆ తర్వాత అటుగా వెళ్తూ పోలీస్ స్టేషన్ బోర్డ్…
Bangladesh: గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే,…
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.
Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.