బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా 24 గంటలు గడవక ముందే మరో హిందువు హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో హిందువుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సోమవారం (జనవరి 5) సాయంత్రం జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ అనే హిందూ యువకుడిని పట్టపగలు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రాణా ప్రతాప్ హత్య జరిగి 24 గంటలు గడవక ముందే మరో హిందు వ్యక్తి హత్యకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: Off The Record : కుప్పంలో చంద్రబాబును మభ్య పెడుతున్నారా?
సోమవారం రాత్రి 10 గంటలకు నర్సింగ్డి జిల్లాలో మోని చక్రవర్తిపై పదునైన ఆయుధాలతో దాడి జరగడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బంగ్లాదేశ్‌లో హిందువుల హత్య సంఖ్య 6కు చేరింది. ఇప్పటి వరకు దీపు దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్, ఖోకోన్ దాస్, రాణా ప్రతాప్ హత్యకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, షోల్డర్ బటన్లతో రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?