Kangana Ranaut: బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు ఘటనపై మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. షేక్ హసీనా భారత్లో సురక్షితంగా ఉండడం గౌరవప్రదమైన విషయమని అన్నారు.
Bangladesh: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతి పెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది.
Waker uz Zaman: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తాజాగా బంగ్లాదేశ్ దేశ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైనంతగా త్వరగా పనులు జరుగుతున్నయని పేర్కొన్నారు. దేశంలో ఈ సందర్బంగా మధ్యంతర ప్రభుత్వం పాలన చేపట్టనుందని., తాను దేశంలోని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడానని, అలాగే శాంతిభద్రతల బాధ్యతను సైన్యం తన చేతిలోకి తీసుకుంటుందని ఆర్మీ చీఫ్ చెప్పారు. Collectors Conference:…
బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
India’s fighter Aircraft: బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతుంది. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన సీ-130 ఎయిర్క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ అలర్ట్ అయింది.
Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
Air India: బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది.
నిరసనకారుల ఆందోళనతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ లేదా లండన్కు పారిపోయినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.