Chinmoy Krishna Das: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు గాను 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది. కాగా, ఈరోజు చిన్మోయ్ కృష్ణ బెయిల్ కోసం సుప్రీంకోర్టులోని న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ మధ్య వాదనలు జరిగాయి. సుమారు 30 నిమిషాల పాటు ఇరువురి వాదనలు విన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం ఈ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చారు.
Read Also: Bhagyashree : భలేగా ఛాన్స్ లు కొట్టేస్తున్న భాగ్యశ్రీ
ఈ సందర్భంగా హిందూ సన్యాసి తరపు న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ మాట్లాడుతూ.. మేము ఐంజీబీ ఐక్య పరిషత్ బ్యానర్ ఆధ్వర్యంలో చటోగ్రామ్‌కు వచ్చాం.. చిన్మయ్ బెయిల్ కోసం తాము కోర్టులో వాదనలు వినిపించాం.. అలాగే, నేను ఇప్పటికే చిన్మోయ్ నుంచి వకలత్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక, అనేను సుప్రీం కోర్ట్, ఛటోగ్రామ్ బార్ అసోసియేషన్‌లలో సభ్యుడిని కాబట్టి ఈ కేసును తరలించడానికి నాకు స్థానిక న్యాయవాది నుంచి అనుమతి అవసరం లేదన్నారు. తర్వలోనే బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకుంటామని ప్రటించారు. కాగా, 2024 డిసెంబర్ 3వ తేదీన ప్రాసిక్యూషన్ టైమ్ పిటిషన్‌ను సమర్పించినందున హిందూ సన్మాసి చిన్మోయ్ కృష్ణదాస్ తరపున న్యాయవాది లేకపోవడంతో బెయిల్ పిటిషన్ విచారణ జనవరి 2వ తేదీకి ఛటోగ్రామ్ కోర్టు వాయిదా వేసింది.