Bangladesh: బంగ్లాదేశ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సంజీబ్ వాజెద్ సంచలన ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ నాయకులపై వేధింపుల కోసం న్యాయవ్యవస్థను యూనస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు పక్షపాత విచారణ నిర్వహించాలని వాజెద్ కోరారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ఆగస్టు 05న బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చారు. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం ఆమెపై అనేక నేరాలు మోపింది, తమకు ఆమెను అప్పగించాలని భారత్‌ని బంగ్లాదేశ్ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే వాజెద్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: MS Dhoni: కుమార్తె కోసం శాంతా క్లాజ్‌గా మారిన మహీ.. ఫోటో వైరల్
బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) హసీనా మరియు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక , పౌర అధికారులకు “మానవత్వం మరియు మారణహోమంపై నేరాలకు” అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ‘‘ఎన్నికలు లేకుండా యూనస్ ప్రబుత్వం నియమించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ ద్వారా హాస్యాస్పదమైన విచారణ ప్రక్రియ నిర్వహిస్తున్నారి, ఇది న్యాయమాన్ని వదిలేసి అవామీ లీగ్ నాయకత్వాన్ని హింసించేందుకు జరుగుతున్న దాని సూచిస్తుంది’’ అని వాజెద్ మంగళవారం తన పోస్టులో తెలిపారు.
వందలాది నాయకుల్ని, కార్యకర్తల్ని చట్టవిరుద్ధంగా చంపారని, వేలాది మందిని అక్రమంగా నిర్బంధించారని ఆయన విమర్శించారు. యూనస్ పాలన న్యాయవ్యవస్థను ఆయుధాలుగా మార్చిందని, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం లేదని ఆయన వాజెద్ అన్నారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 1500 మంది మరణించగా, 19931 మంది గాయపడినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్‌లో నిర్మితమవుతున్న తొలి అణువిద్యుత్ కేంద్రం ఒప్పందానికి సంబంధించి షేక్ హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.