రెండు దేశాల మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతపై భారత ప్రభుత్వం సోమవారం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను పిలిపించింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులోని ఐదు చోట్ల ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. చపైనవాబ్‌గంజ్, నౌగావ్, లాల్మోనిర్హాట్, తీన్ బిఘా కారిడార్‌తో సహా ఐదు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటన్నింటి మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.
READ MORE; Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
కాగా.. బంగ్లాదేశ్‌లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు. యూనస్ వచ్చినప్పటి నుంచి క్రమేపీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ బలపడుతోంది. ముఖ్యంగా మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి పార్టీలు భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. ఇక మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.