Puri Shankaracharya: ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని అడ్డుకోలేకపోతోంది. దీనికి తోడు జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా టీమ్ వంటి మతఛాందస, ఉగ్రవాద సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. పలువురు ఉగ్రవాద నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తోంది.
Read Also: Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై భారత్ ఆందోళన చెందుతోంది. పలుమార్లు హిందువుల భద్రతను నిర్ధారించాలని బంగ్లాని కోరింది. మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులపై పూరీ శంకరాచార్య శ్రీ నిశ్చలానందజీ సరస్వతి మహారాజ్ బంగ్లాదేశ్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గంగాసాగర్ మేళాలో ఆయన మాట్లాడుతూ.. హిందూ సమాజాలపై పెరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, హిందువులపై దాడులు కొనసాగితే “భయంకరమైన పరిణామాలు” ఎదుర్కోవాల్సి ఉంటుందని బంగ్లాకు వార్నింగ్ ఇచ్చారు.
బంగ్లాదేశ్ హిందువులపై చిన్నచూపు చూస్తోందని, హిందువులను హింసించినా, అక్కడి నుంచి తరిమికొట్టి, తక్కువ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఉన్న ఇతర ప్రదేశాల్లో వారి పరిస్థితి ఎలా ఉంటుంది..? ఆయన ప్రశ్నించారు. సమాజాల మధ్య పరస్పర గౌరవం అవసరమని అన్నారు. శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ చారిత్రాత్మకంగా భారత్‌లో భాగమని ఆయన అన్నారు. బెంగాల్ లోని చాలా మంది ముస్లింల పూర్వీకులు, హిందువులే అని అన్నారు. వివిధ పరిస్థితుల్లో వారు మతాన్ని మారిన వాస్తవాన్ని గుర్తించాలని చెప్పారు