వాతావరణ శాఖ150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం ‘అఖండ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. జనవరి 14న ఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ సదస్సు కోసం అవిభక్త భారతదేశంలో భాగమైన పొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ పాల్గొంటుంది కానీ.. ఈ సెమినార్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. ఈ సెమినార్ కోసం పాకిస్థాన్-బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఆహ్వానాలు పంపారు.
READ MORE: LIC Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతి నెల రూ. 12 వేలు పొందండి
పాకిస్థాన్ హాజరవుతున్నట్లు వెల్లడించింది. కానీ బంగ్లాదేశ్ దానిని తిరస్కరించింది. బంగ్లాదేశ్ వాతావరణ విభాగం (BMD) తాత్కాలిక డైరెక్టర్ మోమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారత వాతావరణ శాఖ తమను ఆహ్వానించిందని, అయితే తాము దానికి వెళ్లడం లేదని అన్నారు.
READ MORE:Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ
కాగా.. బంగ్లాదేశ్‌లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు. యూనస్ వచ్చినప్పటి నుంచి క్రమేపీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ బలపడుతోంది. ముఖ్యంగా మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి పార్టీలు భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. ఇక మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.