Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Sheikh Hasina: ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని దించేందుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు కొన్ని నెలలకే నిజమయ్యాయి. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు.
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఈరోజు ఆ దేశ పార్లమెంట్‌ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్ సెక్రటరీ షిఫ్లూ జమాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని ఈ రోజు రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు
దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో కొందరు ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.