Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
Bangladesh Protest : బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితులపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై భారతదేశంలో వివాదం ఆగలేదు..బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది.
Bangladesh: రిజర్వేషన్లపై నిరసనలు బంగ్లాదేశ్లో ఉద్రిక్తంగా మారాయి. 1970లలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి.
Bangladesh Protests: బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.