Khaleda Zia: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజుల మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోడానికి అమెరికా, పాకిస్థాన్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో…
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తు జాబితా నుంచి కమలం చిహ్నాన్ని తొలగించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ కమలం గుర్తును తమ పార్టీకి కేటాయించాలని ఎన్నికల సంఘంకి విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చకు దారి…
One Year of Yunus Rule: బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. గడిచిన ఈ ఏడాది కాలంలో ఆ దేశం అనుసరించిన విదేశాంగ విధానంలో అనేక మార్పులు స్పష్టంగా కనిపించాయని దౌత్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూనస్ చేతికి ఎప్పుడైతే పాలనా పగ్గాలు వెళ్లాయో నాటి నుంచి బంగ్లాదేశ్- ఇండియా సంబంధాలు క్షీణించాయి. ఈ సమయంలోనే బంగ్లాకు చైనా, పాకిస్తాన్లతో మైత్రి పెరిగింది. అలాగే జపాన్, యూరోపియన్ యూనియన్తో సంబంధాలు కూడా బలోపేతం…
Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల…