నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం గత నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్ బూత్ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్ కమిటీలు ఎంత వరకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ బీజేపీ నేతలకు దొరకనుంది.
Bandi Sanjay: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. సీఎం కేసీఆర్ వచ్చేవరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కదిలేదిలేదని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.. దీంతో, బండి సంజయ్, కొందరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, బండి సంజయ్‌ను పోలీస్ వాహనంలో ఎక్కించి పీఎస్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు కార్యకర్తలు.. పోలీస్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు..…
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డికి చేరుకున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాములుని కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చేసిన హత్యేనని ఆరోపించారు.. ముఖ్యమంత్రి కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టరేట్ వద్దనే కూర్చుంటాన్న ఆయన.. కామారెడ్డి రైతులకు న్యాయం…
Vemula Prashanth Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆరోపణలు, విమర్శల పర్వంలో రెండు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి… బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు.. తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురపించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పొగుడుతుంటే..…