Minister Malla Reddy: బండి సంజయ్‌కి మంత్రి మల్లారెడ్డి సవాల్.. రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను అంటూ బండి సంజయ్‌కి చాలెంజ్ విసిరారు మల్లారెడ్డి.. ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే మంత్రి , ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తా.. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసినంత మేలు చేసిన ప్రభుత్వాన్ని చూపించు అంటూ సవాల్ విసిరారు..
Read Also: Attack on female sarpanch : మహిళా సర్పంచ్‌పై దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కాగా, మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై స్పందిస్తూ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తాను చెప్పు దెబ్బలు తినడానికి సిద్దమే అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఆ తర్వాత చెప్పుతో కొట్టుకోవడానికి.. కొట్టించుకోవడాని సిద్ధమన్న ఆయన.. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నాటకాలంటూ ఫైర్ అయ్యారు.. తండ్రి తల నరికినా.. కొడుకు చెప్పుతో కొట్టినా ప్రజల ప్రయోజనాలకోసం భరించడానికి రెడీగా ఉన్నానని నిన్న బండి సంజయ్ వ్యాఖ్యానించారు.. ఇక, ముందుగా డ్రగ్స్ కేసు విషయంలో బండి సంజయ్ చేసిన సవాల్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. టెస్ట్ కు నేను రెడీ.. నా రక్తం, బొచ్చు, కిడ్నీ ఇస్తా.. చిత్తశుద్ధితో వస్తాను.. కరీంనగర్ సెంటర్‌లో చెప్పుతో కొట్టుకోవడానికి బండి సంజయ్ సిద్ధంగా ఉన్నాడా అని కేటీఆర్ సవాల్ విసిరిన విషయం విదితమే.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- cm kcr
- hyderabad
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!