Bandi sanjay: పాలనపై వాస్తవాలు ప్రజల ముందుంచాలి.. సీఎంకు బండి సంజయ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay letter to CM KCR: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతూ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
లేఖలో ఏముందంటే..
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
• వడ్ల కుప్పలపై రైతు చనిపోమే దుస్థితికి కారణమెవరు?
• రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్నీ ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది నిజం కాదా?
• రూ.లక్షదాకా రుణమాఫీ చేస్తానని, ఫ్రీ యూరియా, విత్తనాలిస్తానని హామీలిచ్చి మాట తప్పింది నిజం కాదా?
• ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే లాకప్ డెత్ లు చేయడమా? ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపడమేనా?
• గత పాలనతో పోలిస్తే మూడింతల కరెంట్ ఛార్జీలను పెంచడమే కాకుండా ఏసీడీ చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో జనంపై భారం మోపడమే విద్యుత్ రంగంలో మీరు సాధించిన విజయమా?
• ఉచిత కరెంట్ పేరుతో డిస్కంలను సంక్షోభంలో నెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది నిజం కాదా?
• పారిశ్రామిక రంగంలో అద్బుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతున్నారు?
• మీ పాలనలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంతమంది ఉపాధి కోల్పోయారు? ఎన్ని పరిశ్రమలొచ్చాయి? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా?
• కమీషన్ల కోసం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంతో కొత్తగా కనీసం ఎన్ని ఎకరాలకు కూడా నీళ్లివ్వని మాట వాస్తవం కాదా?
• సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప మీరు సాధించిన ప్రగతి ఏముంది?
• మిషన్ కాకతీయ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చి దండుకోవడం నిజం కాదా? మిషన్ కాకతీయ ద్వారా అదనంగా ఎంత ఆయకట్టుకు నీరిందించారో చెప్పే దమ్ముందా?
• 57 ఏళ్లకే ఫించన్ ఇస్తామని ఓట్లు దండుకుని మోసం చేసింది మీరు కాదా?
• 3.5 లక్షల పాత పింఛన్లను తీసేయడమే కాకుండా కొత్త పింఛన్ల కోసం 14 లక్షల మంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా కనికరం చూపని మాట వాస్తవం కాదా?
• సారు… కారు… 60 పర్సంట్ సర్కార్ ఎవరిది? దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్న అవినీతి ప్రభుత్వం మీది కాదా?
• మీది నిజంగా సుపరిపాలనే అయితే 50 వేలకుపైగా జీవోలను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడుతలేరు?
• మీకు డబ్బా కొట్టేవాళ్లను మాత్రమే కవులు, కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచుతూ తెలంగాణ కోసం పాటుపడుతున్న కవులు, కళాకారులను పక్కనపెట్టినందుకు సాహిత్య దినోత్సవం జరుపుకుంటున్నారా?
• ప్రశ్నించే గొంతులను పోలీసుల ద్వారా అణిచివేయిస్తూ విజయవంతంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నందుకు ‘‘సురక్షా దినోత్సవం‘‘ జరుపుకోవాలనుకుంటున్నారా?
• మహిళలపై అఘాయిత్యాల్లో దక్షిణాదిలోనే తెలంగాణే టాప్ ఉన్నందుకు…. మహిళలపై సొంత పార్టీ నేతలే అఘాయిత్యాలు చేస్తున్నందుకు ‘‘మహిళా దినోత్సవం’’ జరుపుకోవాలనుకుంటున్నారా?
• సర్కారు దవాఖాన్లలో సౌలతుల్లేక బాలింతలు చనిపోతున్నందుకు, రోగమొస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆస్తులమ్మి చికిత్స చేయించుకునే దుస్థితి వచ్చినందుకు ‘‘వైద్యారోగ్య దినోత్సవం’’ జరుపుకుంటున్నారా?
• పల్లెల, పట్టణాల ప్రగతిని గాలికొదిలేసినందుకు పల్లె, పట్టణ ప్రగతి ఉత్సవాలు జరుపుకుంటున్నారా?
• ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షలిస్తామని చెప్పి మోసం చేసినందుకు…సర్పంచుల డిజిటల్ కీని దొంగిలించి డబ్బులు కాజేసినందుకు, బిల్లులు రాక సర్పంచులు ప్రాణాలు తీసుకుంటున్నందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారా?
• పోడు పట్టాలడిగినందుకు మహిళలని చూడకుండా గిరిజనులను జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్లినందుకు, బాలింతలకు బేడీలేసి పసిపిల్లలతో కలిసి జైలుకు పంపినందుకు గిరిజనోత్సవాలు చేసుకోవాలని చెబుతున్నారా?
• మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ కొన్ని వందల గ్రామాలకూ మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?
• ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నదే నిజమైతే ప్రతి పల్లెలో క్యాన్ల నీళ్లు ఎందుకు కొనుక్కుని తాగుతున్నరో చెప్పగలరా?
• శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే పిచ్చి మొక్కలను డివైడర్ల మధ్య నాటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం, అడవులను నరికి మళ్లీ అక్కడే మొక్కలను నాటాలని చెప్పడమే ‘‘హరితోత్సవాల’’ లక్ష్యమా?
• రాష్ట్రంలో 29 వేల బడుల పరిస్థితి అధ్వాన్నంగా మారినందుకు, ఎస్సీ,ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పురుగుల అన్నమే దిక్కని చాటి చెప్పేందుకే ‘‘విద్యా దినోత్సవం’’ జరుపుకోవాలా?
• రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయాన్ని వందల కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని అరచేతిలో వైకుంఠం చూపించి దేవుళ్లకే శఠగోపం పెట్టినందుకు ‘‘ఆధ్యాత్మిక దినోత్సవాలు’’ జరుపుకోవాలా?
• అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో వారి కుటుంబాలను గాలికొదిలేసి ఉద్యమ ద్రోహుల్ని రాష్ట్రాన్ని పాలిస్తు ప్రజలను రాచిరంపాన పెడుతున్నందుకు ‘‘అమరుల సంస్మరణ’’ దినం జరుపుకోవాలా?
• మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు? దగాపడ్డదెవరు? 9 ఏళ్ల మీ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తారా? లేఖకు సమాధానం ఇస్తారా? అనే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
Odisha Train Accident: బాధితుల ఆర్తనాదాలు.. రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్న యువత..
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!