తెలంగాణ దశాబ్ధి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. రివర్స్ గేర్ లో తెలంగాణ బండి సంజయ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు వ్యతిరేక విధానాలపై రేపు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపటి నుండి 22వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ నేతలందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నారు బండి సంజయ్. అంతేకాకుండా.. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధచేస్తున్నారు.
Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతోపాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 3న రైతు వ్యతిరేక విధానాలపై జాతీయ, రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే…. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. జూన్ 4న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటోందనే అంశంతోపాటు పోలీసులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజల ద్రుష్టికి తేవాలని సూచించారు. జూన్ 5న విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై పడుతున్న భారంతోపాటు కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థలు ఏ విధంగా దివాళా తీశాయనే అంశంపై తానే స్వయంగా ఎండగట్టేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం సంక్షోభానికి గురైన విషయాన్ని జూన్ 6న, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీపై జూన్ 7న, చెరువుల కబ్జాలపై, 8న, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కేసీఆర్ పాలనలో సంక్షోభంలో పడిందనే అంశంపై, 9న, కేసీఆర్ దుష్పరిపాలనలో పెచ్చరిల్లిన అవినీతిపై, 10న, దశాబ్ది తెలంగాణలో కవులు, కళాకారులతోపాటు సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయంపై, 11న కార్యక్రమాలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని బండి సంజయ్ ఆయా నేతలను కోరారు.
America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
ఈనెల 12న ప్రభుత్వం ’’తెలంగాణ రన్‘‘ నిర్వహిస్తున్నందున.. అదేరోజు తిరోగమనంలో తెలంగాణ పేరుతో యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ’’రివర్స్ రన్‘‘ నిర్వహించాలని సూచించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై 13న, కుంటుపడ్డ వైద్యంతో ప్రజలు పడుతున్న తిప్పలపై 14న, స్థానిక సంస్థల నిర్వీర్యం, ప్రజాప్రతినిధులు పడుతున్న బాధలపై 15, 16 తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలతోపాటు పోడు భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు పడుతున్న ఇబ్బందులై 17న, ఖాళీ బిందెలతో 18న, హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు ఆ నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే అంశంపై 19న, కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ దుర్గతిపై 20న,
దేవాలయ భూముల కబ్జా, హిందువులపై జరుగుతున్న దాడులపై 21న, అమరుల యాదిలో… పేరిట తెలంగాణ అమర వీరుల కుటుంబాలతోపాటు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై జూన్ 22న వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు బండి సంజయ్.