Telangana BJP: బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే పార్టీ చీఫ్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమంటున్న బీజేపీ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్పుపై దృష్టి సారించిందా.. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కమలదళంలో హోరెత్తిపోతోంది. బండి సంజయ్‌ను మారిస్తే.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అయితే, కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం.. కిషన్‌రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంగీకరిస్తే.. బండి సంజయ్‌ను ఏ పదవి వరిస్తుంది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని, అలానే కొన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులను మారుస్తారని కమలదళంలో చర్చ జరుగుతోంది.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ఈ లిస్ట్‌లో తెలంగాణ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి నుంచి తప్పిస్తే.. ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి మరో బీజేపీ నేతకు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక, ఇటీవల తెలంగాణలోని బీజేపీలో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్‌కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పార్టీ హైకమాండ్ సూచనలు చేసింది. మరోవైపు ఈటల రాజేందర్‌కు బీజేపీ ఎన్నికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. అసలు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుకి, ఎన్నికల షెడ్యూల్‌కు లింక్ పెడుతున్నాయి పార్టీ వర్గాలు. నవంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు జరిగితే.. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వస్తే బండి సంజయ్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే.. బీజేపీకి ఆత్మహత్యాసదృశ్యమే అన్నారు మాజీ ఎంపీ విజయరామారావు. అదే జరిగితే బీజేపీలో ఇక చేరికలు ఉండవని జోస్యం చెబుతూ ట్వీట్ చేశారు. పైగా కమలనాథులు.. పార్టీని వీడతారని హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారిపోయిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..