Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు.
Jagga Reddy : మారు మూల గ్రామం వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు.. ఇందిరమ్మ ఇచ్చిన ఇంటి జాగా ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలమని, ఇందిరా గాంధీ.. నిజాం కాలేజీకి వస్తుంది అంటే.. మూడు రోజుల ముందు వచ్చి జనం ఎదురు చూసే వారన్నారు. తెలంగాణలో ఎంపీ సీట్లు మిస్టేక్‌లో వచ్చాయని, మళ్ళీ పెరుగుతాయి అనుకుంటున్నారు కానీ పెరగవన్నారు. ఇందిరమ్మ గురించి ఏం తెలుసు నీకు.. మనం పుట్టక…
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
Bandi Sanjay : నాకు, పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ మధ్య ఎలాంటి విబేధాల్లేవు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఖట్టర్ కష్టపడి ఎదిగి.. కట్టర్ ఈ స్థాయికి వచ్చారని, అంతటి గొప్ప వ్యక్తి కరీంనగర్ రావడం మనందరి అదృష్టమన్నారు బండి సంజయ్. కరీంనగర్ లోని 4 వేల…
ధరణి పేరుతో కొంప ముంచారు.. ఈ ధరణితో ఒక కుటుంబంతో పాటు కొందరే లాభపడ్డారు అని వెల్లడించారు. దళితులకు ఇచ్చిన భూముల్లోనే శ్మశానాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు.. కబ్జాకు గురైనా భూములు స్వాధీనం చేయడంలో అధికారులు వెనకడుగు వేయొద్దు.. మా సహాకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని బండి సంజయ్ తెలిపారు.
కేటీఆర్, బండి సంజయ్‌లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే…