Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 29 01 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 29, 2025 , 9:19 pm
By Gogikar Sai Krishna
  • పుంగనూరు ఎస్టేట్‌ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్..
  • గుడ్‌న్యూస్.. త్వరలో అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్..
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..
  • హైదరాబాద్‌లో రేపు నాన్‌ వెజ్‌ షాపులు బంద్‌.. ఎందుకంటే..!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పుంగనూరు ఎస్టేట్‌ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్..

పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. “సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు‌‌. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం.. అప్పుడే మామిడి చెట్లు పెట్టాం. ఇరవైఏళ్ళ తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో కిరణ్ కూమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగింది. అది ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారు..” అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
  • MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
Add as a preferred
source on google

ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్​.. అధికారులు, ఉద్యోగులను అభినందించిన సీఎం

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.

బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

8వ తరగతి విద్యార్థులు ఏడో తరగతి పుస్తకాలు చదవడం లేదు.. దీనికి గత ప్రభుత్వమే కారణం..

జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. “పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు.. వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు తయారయ్యారు. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి నెలకొంది.” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ప్రతి మనిషికి 100 లీటర్ల నీరు.. ప్రతిరోజు అందించాల్సిందే

వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండన్నారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ పై వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు ఎందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. ఎంతమంది మిషన్ భగీరథ నీరు తాగునీటి కోసం వినియోగించడం లేదో సర్వేలు చేపట్టండని ఆమె అన్నారు.

బెంగళూరులో అగ్నిప్రమాదం.. 150 వాహనాలు దగ్ధం

బెంగళూరు శ్రీరాంపురలోని పోలీస్‌ యార్డులో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల్లో 130 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, పది కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శ్రీరామ్‌పురలో పోలీసులు వాహనాలు సీజ్‌ చేసి పార్క్‌ చేసి ఉంచిన స్థలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఒకదాని వెంట మరొకటి మంటలు అంటుకున్నాయి. దీంతో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 130 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 10 కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బ్యాటరీల్లో మండే పదార్థాలు ఉండటమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో రేపు నాన్‌ వెజ్‌ షాపులు బంద్‌.. ఎందుకంటే..!

మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా రేపు (జనవరి 30) హైదరాబాద్ నగరంలో అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రెల మండిలు, మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నాయి.

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. మాంసం దుకాణాలు తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో సహకరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని అందరూ పాటించాలని, హింసాత్మక చర్యలను చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఆయా అంశాలపై డీజీపీ ఫోకస్..

నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు టార్గెట్‌గా ఉన్నాయన్నారు.. ఇటీవల ఫేక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు అమాయకులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్నారు.. గంజాయి, స్మగ్లింగ్‌ని పూర్తిగా అరికడతామన్నారు.. రాష్ట్రంలో సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుందని వెల్లడించారు.. టెక్నాలజీని వాడుకొని సాధ్యం అయినంత ఎక్కువ వాటిని అరికట్టాలన్నారు. చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు జరగటం తలదించుకోవాల్సిన విషయమని తెలిపారు.

ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్‌ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డియార్టుమెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలని, సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

గుడ్‌న్యూస్.. త్వరలో అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్..

కాకినాడ లో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వీరి మధ్య చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. హోటల్ ఓనర్లకు శుభవార్త చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు 66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు.. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజా తంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.. బుధవారం ఆయన మాట్లాడుతూ.. “గద్దర్ ఏనాడూ అవార్డుల కోసం, పదవుల కోసం ఎదురు చూడలేదు.. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు ఆయన తొండి సంజయ్.. అవార్డులు కేంద్రం ఇస్తుందా.. లేక బీజేపీ పార్టీ ఇస్తుందా? కుంభమేళా తొక్కిసలాటపై యూపీ సీఎం జాతికి క్షమాపణ చెప్పాలి.. కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం వలనే తొక్కిసలాట జరిగింది..” అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • CM Revanth Reddy
  • kandula durgesh
  • peddireddy Ramachandra Reddy
  • telugu news

తాజావార్తలు

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..

  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..

  • MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు

  • Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions