Jagga Reddy : మారు మూల గ్రామం వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు.. ఇందిరమ్మ ఇచ్చిన ఇంటి జాగా ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలమని, ఇందిరా గాంధీ.. నిజాం కాలేజీకి వస్తుంది అంటే.. మూడు రోజుల ముందు వచ్చి జనం ఎదురు చూసే వారన్నారు. తెలంగాణలో ఎంపీ సీట్లు మిస్టేక్‌లో వచ్చాయని, మళ్ళీ పెరుగుతాయి అనుకుంటున్నారు కానీ పెరగవన్నారు. ఇందిరమ్మ గురించి ఏం తెలుసు నీకు.. మనం పుట్టక ముందే… ఇందిరమ్మ ఇళ్లు..జాగా ఇచ్చిందన్నారు. బండి సంజయ్ కి ఇందిరమ్మ చరిత్ర ఏం తెలుసు..? అని ఆయన ప్రశ్నించారు. నీ పార్లమెంట్ లో..నీ ఊరికే పోదామని, నీ సొంత ఊరుకు పోదామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో లేదో తెలుసుకుందామని, 80 యేండ్ల అవ్వను అడిగితే చెప్తుంది ఇందిరాగాంధీ చరిత్ర ఏంటో..? అని ఆయన వ్యాఖ్యానించారు.
Manchu Vishnu : త్రివిధ దళాల కుటుంబాల కోసం ముందడుగు వేసిన విష్ణు మంచు
ఆరేళ్ల జైలు కి వెళ్ళింది ఇందిరమ్మ.. ఇందిరాగాంధీ జైల్లో ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ పుట్టాడు.. బండి సంజయ్ కి ఏం తెలుసు.. తూ తెలియదు.. థా తెలియదు అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మేము అద్వానీ..వాజ్ పాయ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇప్పించిన చరిత్ర అన్నారు. ఇందిరా గాందిగురించి ఎంత చెప్పిన తక్కువే లాభమని, బీజేపీ పుట్టి 40 ఏండ్లు… కాంగ్రెస్ పుట్టి 140 ఏండ్లు అని, ఇందిరా గాంధీ జేజమ్మ… జేజమ్మ కి దగ్గు నేర్పినట్టు ఉంది.. ఇందిరమ్మ గురించి మాట్లాడి నవ్వుల పాలు కావద్దు..’ అని ఆయన అన్నారు.
Bangladesh: మహ్మద్ యూనస్‌లకు ట్రంప్ షాక్.. ఇక బంగ్లాదేశ్ అడుక్కుతినడమే..