Bandi Sanjay : సీఎం హామీలు అమలు కాలేదంటే… ముఖ్యమంత్రి పదవికే కళంకం
- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
- నాలుగు పథకాలు అర్హులందరికీ అందించకపోవడం దారుణం
- మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే… నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమని, 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటి? అని ఆయన వ్యాఖ్యానించారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42 వేల 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదమని, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు అన్నారు బండి సంజయ్.
Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్ 2లు కూడా వెళ్లిపోయారు.
Also Read
ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా నేటికీ నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణమని, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రులు ప్రజలకు ఒక మాట ఇచ్చారంటే అదే శాసనంగా అమలయ్యేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎంగా ఉన్న మీరు హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమని, సీఎం హామీలు అమలు కాలేదంటే… ముఖ్యమంత్రి పదవికే కళంకమన్నారు. సీఎం హామీలనే అమలు చేయలేకపోతే, మీ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీ తనంతో పనిచేయగలరు? అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సీఎం హామీలు అమలు కాలేదంటే దేశం ద్రుష్టిలో తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే అని, 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, ఇకనైనా వెంటనే అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్లను అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందని, తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరును యధాతథంగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు