CPI Ramakrishna: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..
- గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు
- ప్రజా తంత్ర వాదులు ఖండించాలన్న రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు.. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజా తంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.. బుధవారం ఆయన మాట్లాడుతూ.. “గద్దర్ ఏనాడూ అవార్డుల కోసం, పదవుల కోసం ఎదురు చూడలేదు.. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు ఆయన తొండి సంజయ్.. అవార్డులు కేంద్రం ఇస్తుందా.. లేక బీజేపీ పార్టీ ఇస్తుందా? కుంభమేళా తొక్కిసలాటపై యూపీ సీఎం జాతికి క్షమాపణ చెప్పాలి.. కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం వలనే తొక్కిసలాట జరిగింది..” అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
READ MORE: Kandula Durgesh: గుడ్‌న్యూస్.. త్వరలో అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్..
Also Read
ఇదిలా ఉండగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా గాయకుడు గద్దర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ కు పద్మ అవార్డు ఎలా వస్తుందని, నమ్మిన సిద్దాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి గద్దర్ బీజేపీ కార్యకర్తలను హత్య చేయించారని వ్యాఖ్యానించారు. చాలా మంది పోలీసులు, జవాన్లను గద్దర్ చంపారన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ భావజాలం ఉంటేనే పద్మ అవార్డులు ఇస్తారా? అని, అవార్డులు రావాలంటే బీజేపీకి జై కొట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బండి సంజయ్ మరోసారి స్పందిస్తూ.. గద్దర్ మీద విమర్శలు చేయడం ఏంటని అంటున్నారని.. కానీ నక్సలైట్లు చాలామంది కార్యకర్తలను చంపారు కదా? అని ప్రశ్నించారు.
READ MORE: Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!