బండి సంజయ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శల దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు బీజేపీ ఏమైనా చేసిందా..? బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ..చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.
Read Also: రాయలసీమలో ఆర్థిక వనరులున్నా అభివృద్ధిలేకుండా చేశారు: సోము వీర్రాజు
పోడు భూములపై పోరాటం చేస్తామని బండి సంజయ్ అంటున్నారు. అటవీ చట్టాలు కేంద్రం పరిధిలో ఉన్నవి గుర్తు పెట్టుకోవాలన్నారు. పోడు భూములపై మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. గిరిజనులపై ఏమాత్రం బీజేపీకి ప్రేమ ఉన్నా..రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదు ? అంటూ ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు ? గిరిజనులపై బీజేపీది కపట ప్రేమ కాదా అంటూ మంత్రి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు.