తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై ఆయన మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది.…
ఉక్రెయిన్ -రష్యా యుద్ధంతో అక్కడ వున్న విదేశీ విద్యార్ధులు, పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థులకు తల్లిదండ్రులకు వర్చవల్ గా ధైర్యం, జాగ్రత్తలు చెబుతూ భారత దేశానికీ మరింత వేగంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ . ప్రోగ్రాంలో నిర్వాహకులు, ముఖ్య నాయకులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, ఎంపీ జీవీల్ నరసింహారావు, బీజేపీ…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…
ఎన్నో ఆశలతో బీజేపీలో చేరిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? పార్టీ పెద్దలు పిలిస్తే.. ముందు ఆ సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారా? కాషాయ శిబిరంలో చర్చగా మారిన ఆ అంశం ఏంటి? కమలనాథులను ఏ సమస్య కలవరపెడుతోంది? బీజేపీలో అభ్యర్థులపై క్లారిటీ లేదుఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామన్నది వారి వాదన. ఈ విషయంలో పైకి ఎన్ని చెప్పినా కమలనాథుల్లో అంతర్గతంగా మరో చర్చ…
నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని…
మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు…
ఎన్నో సంక్షేమ పథకాలతో, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్ ఎంపీ బడుగు లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీలు కేసీఆర్ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో కేసీఆర్ కు జనాదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తోందని, విభజన హామీలు నెరవేర్చమని కోరుతున్నా పట్టించు కోవటం లేదని ఆయన మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరయినవి కావని ఆయన…
దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వని వారు ఇక్కడ రాజకీయ లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతూన్నారో తెలియదని, అమ్మ సన్నిధిలో పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారన ఆయన విమర్శించారు. ఎడేల్లు గా పాలన చేస్తున్న మోది మేడారం జాతరకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి గుడికి వెళ్లే ప్రధాని…