రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు…
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘హిందూస్థాన్, పాకిస్థాన్’ అనేది బీజేపీ జీవితకాల నినాదమని, ‘వీరి నాయకులకు జ్ఞానం లేదని’ ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తలసాని.. గత మూడేళ్లలో హైదరాబాద్‌కు కిషన్ ఏం చేశారని ప్రశ్నించారు. వరద సాయం కోసం కూడా కిషన్ ఒక్క రూపాయి…
హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్‌లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. శుక్రవారం నాడు జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నిరసనలపై బీజేపీ నేత స్పందిస్తూ ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించినప్పుడు చంద్రశేఖర్ రావు సభలో లేరని అన్నారు. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలు అబద్ధమని వినోద్ కుమార్ అభివర్ణిస్తూ.. వాస్తవాలు తెలుసుకోకుండా సంజయ్ కుమార్ నిరాధారమైన…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ…
తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనర్ధాలను ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేస్తే… టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్‌ఎస్ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు. రాజ్యాంగంపై విమర్శలను డైవర్ట్ చేసేందుకే టీఆర్‌ఎస్ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఆందోళనలు…