తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగం వుండడం లేదు. ఈ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా తిప్పికొట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం కెసిఆర్ సమక్షంలో సభలు హుందాగా జరిగాయి..జరగబోతున్నాయి.
అధికార పార్టీ సభ్యుల కంటే…ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఎక్కువ సమయం ఇస్తుంది మేమే. విపక్ష సభ్యులు ఇక చాలు అనే వరకు సమాధానాలు ఇస్తున్నాం. . గవర్నర్ ప్రసంగంతో మేము చేసిన అభివృద్ధి చెప్పించాలని అనుకుంటాం. కానీ టెక్నికల్ సమస్య వచ్చింది కాబట్టి.. గవర్నర్ ప్రసంగం ఉండటం లేదు. కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో కూడా ప్రసంగం లేకుండా నే జరిగింది, 2013 లో గవర్నర్ ప్రసంగం లేదు. ప్రొరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు. 2004 లో పార్లమెంట్ లో కూడా రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే సభలు స్టార్ట్ అయ్యాయి. ప్రొరోగ్ కాని సభకు..గవర్నర్ ని పిలిస్తే తప్పు. పిలవకపోతే తప్పు కాదు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రారంభించాలి అని రాజ్యాంగంలో లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుంది బీజేపీ. మహారాష్ట్ర లో వేరే పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తే.. బీజేపీ ముఖ్యమంత్రిని మూడు గంటలకు ప్రమాణం చేయించిన ఘనత బీజేపీది.
గోవా, పాండిచ్చేరిలలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు. రాష్ట్రాల హక్కులను కాలరాసేది బీజేపీయే అన్నారు ప్రశాంత్ రెడ్డి. నిండు సభలో ఏర్పడిన తెలంగాణ ను నిందించిన ఘనత మోడీది. రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణను ఉల్లంఘించి మాట్లాడిన చరిత్ర బీజేపీది. వన దేవత మీద బీజేపీ నేతలకు నమ్మకం ఉంటే.. 400 కోట్లు తెప్పించి ఇవ్వండి. బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.