తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది. అందుకే పార్లమెంట్ స్థాయి తొలి సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నాం.సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తాం.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు దారులను పోలీసులే కిడ్నాప్ చేశారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, భూ కబ్జాలను సహించలేక ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేయడం అన్యాయం. బీజేపీ ఆందోళనతో కిడ్నాప్ చేసిన ఫిర్యాదు దారులను పోలీసులు బయటకు తీసుకొచ్చినప్పటికీ వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. ఎన్నికల కమిషన్ మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకుల 6 గురు ఫిర్యాదు దారులను జైళ్లో పెట్లడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు.చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటు.
బీజేపీ ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తాం.గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతాం.
బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలవల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటింది. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే నిదర్శనం.బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు అన్నారు బండి సంజయ్.
ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయం. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. నిజమైన ఉద్యమ కారులతోపాటు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే మేధావులంతా బీజేపీలోకి రావాలని కోరుతున్నా. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ప్రజా స్వామిక తెలంగాణను ఏర్పాటు దిశగా కృషి చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోంది.భారత జాతీయ పతకాన్ని చూసి రష్యా, ఉక్రెయిన్ దేశాలు సైతం లేచి సెల్యూట్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే ఇందుకు కారణం అన్నారు.