ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ గొడవ ఘటనలో కరీంనగర్ జైలు నుండి 23 మంది బీజేపీ కార్యకర్తలు విడుదలయ్యారు. కరీంనగర్ లో 23 మంది కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ పరామర్శించి,సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా ప్రభుత్వం కేసులు పెట్టిందని, జైలుకి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మళ్ళీ చెబుతున్న కేసీఆర్ కూడా జైలు కి వెళ్తారని, నాతో సహ ఏ బీజేపీ కార్యకర్త జైలుకి వెళ్లిన గళ్ళ ఎగురవేస్తామన్నారు. సిరిసిల్ల ఎస్పీ ఓ రబ్బర్ స్టాంప్.. సీఎంవో ఏది చెబితే అది చేస్తాడంటూ ఆరోపించారు. పోలీస్ ఆఫీసర్ ని విమర్శిస్తే కొంతమంది పోలీస్ సంఘాల సభ్యులు మాట్లాడుతున్నారని, సిరిసిల్ల గొడవలో సీఎం మోచేతి నీళ్లు తాగి కొందరు కొంతమంది పోలీస్ లు పని చేస్తున్నారన్నారు.
కొట్టిన టీఆర్‌ఎస్ వారిపై కేసులు కూడా లేవని, పోలీస్ సంఘాల నాయకులు ఎక్కడ పోయారన్నారు. ఇలా చేస్తే రేపు రిటైర్ ఐయ్యాక వారిని కుక్కలు కూడా పట్టించుకోవని, మీ పిల్లలే మిమ్మల్ని ప్రశ్నిస్తారన్నారు. డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలని, లేదంటే దద్దమ్మ అని ఒప్పుకో .సీఎంఓ మాత్రమే ముఖ్యమని చెప్పండన్నారు. డీజీపీకి నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు.. ట్యాపింగ్ జరుగుతోందని భయపడుతున్నారన్నారు. ఎల్లారెడ్డి పేట ఘటనలో అక్రమ కేసులు ఎత్తివేయాలని, బోధన్ లోను ఇలానే అక్రమ కేసులు పెట్టారన్నారు. బీజేపీ నాయకులు పరామర్శిస్తే అరెస్ట్ చేసారని, అదే ఓవైసీ మాత్రం బోధన్ లో ప్రశాంతంగా తిరిగారు ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.