నేతలు హైదరాబాద్‌ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌పై భయం ఎందుకు బీజేపీ నుండి సీఎం తెలంగాణ వాడే కదా అయ్యేది… పక్క రాష్ట్రం వారు కారు కదా అని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్ని బూతుల్లో జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అంతటా చేయాలని, ప్రతి కార్యకర్త ఇంట్లో అంబేద్కర్ ఫొటో ఉండాలని ఆయన దిశనిర్దేశం చేశారు. పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, మా దగ్గర రిపోర్ట్ ఉందని ఆయన అన్నారు.